శాసనమండలిలో జగన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన టీడీపీ..!!

వాస్తవం ప్రతినిధి: వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదముద్ర పొందటంతో శాసనమండలిలో కూడా ఆమోదముద్ర పొందే అవకాశం ఉందని అందరూ భావించిన తరుణంలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా రూల్‌ 71ను తొలిసారి తెరపైకి తీసుకువచ్చింది. దీంతో జగన్ సర్కార్ ఒక్క సారిగా షాక్ తింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించేందుకు రూల్‌ 71ను తొలిసారి తెలుగుదేశం పార్టీ ఉపయోగించడంతో వైసీపీ పార్టీ నేతలు మంత్రులు ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నారు. కాగా రూల్‌ 71 తీర్మానంను సభలో ప్రవేశపెట్టాలంటే మెజార్టీ అవసరం. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ మెజారిటీని చూడగా తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎమ్మెల్సీల మద్దతు ఉంది. 20 మంది ఎమ్మెల్సీల మద్దతు ఉంటే రూల్‌ 71ను సభలో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న దాని కన్నా బలం ఉండటంతో తీర్మానంపై చర్చకు మండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు పట్టుబట్టారు. తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించినట్టే అవుతుంది. దీంతో రూల్ 71ని ప్రవేశపెట్టే అధికారం మండలికి లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొంటున్నారు. మొత్తానికి టీడీపీ వ్యూహంతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.