అప్పుడు తుగ్లక్ ఇప్పుడు జగన్ అంటున్న టీడీపీ నేత..!!

వాస్తవం ప్రతినిధి: వికేంద్రీకరణ పేరిట వైయస్ జగన్ తీసుకుంటున్న మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ విభేదిస్తుంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని మార్పునకు అవకాశం లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన నేత నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జగన్ ఎల్లకాలం అధికారంలో ఉండడం కష్టమని రేపు మరొకరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే అవకాశం ఉందని అప్పుడు మళ్లీ రాజధాని మార్చుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. చరిత్రలో ఎవరూ రాజదానులను మార్చలేదని, ఒక్క తుగ్లక్ మాత్రమే మార్చారని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలో ఒక్క రాజదాని మాత్రమే ఉందని, మూడు రాజదానులు, ముప్పై రాజదానులు అని లేదని ఆయన అన్నారు. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, మరి ఇప్పుడు ఆ రోడ్డు సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. మూడు రైల్వే లైన్ లు వచ్చే అవకాశం ఉందని వాటి పరిస్థితి ఏమిని అన్నారు. ఎపి ప్రబుత్వానికి అవసరమైన భవనాలు అన్నీ ఉన్నాయని, వాటి పరిస్తితి ఏమిటని నిమ్మల అన్నారు. కొన్ని వందల సంఖ్యలో ప్రాజెక్టుల ఉన్నాయని వాటి సంగతి ఏమిటని ప్రశ్నించారు. మొత్తం మీద అప్పట్లో తుగ్లక్ రాజధాని మారిస్తే మళ్లీ ఇప్పుడు వైయస్ జగన్ రాజధాని మార్చడం జరిగింది అన్నట్టుగా టిడిపి నిమ్మల రామానాయుడు విమర్శల వర్షం కురిపించారు.