ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు కొత్తగా జోలె పట్టుకుని అడుక్కుంటున్నారు: అనిల్ కుమార్ యాదవ్

వాస్తవం ప్రతినిధి: నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటుంటారని… టీడీపీవాళ్లు అలాగే ప్రవర్తిస్తుంటారని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు నవ్వడమే తెలియదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. అన్నారు. శాసనసభలోకి వస్తూనే బ్యాడ్ మార్నింగ్ అంటున్నారని మండిపడ్డారు. శాసనసభలో ఎస్సీ కమిషన్ పై చర్చ సందర్భంగా… అమరావతిపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనల మధ్య అనిల్ కుమార్ కు స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు జోలె పట్టుకుని అడుక్కుంటున్నారని అన్నారు. కార్పొరేషన్ డబ్బులను ఎన్నికల స్టంట్ కోసం ఖర్చు చేశారని చెప్పారు. ఏడుపు ముఖంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. పొత్తు లేనిదే మీకు ముద్ద కూడా దిగదని ఎద్దేవా చేశారు. వైసీపీ సింగిల్ గానే వెళ్తుందని చెప్పారు.