రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టు

వాస్తవం ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. రాజధాని ఆందోళనలో కీలకంగా వ్యవహరిస్తున్న 800 మందికి పైగా తెలుగుదేశం నాయకులను ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారరు. అలాగే విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణను, రాజమండ్రిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.