ముఖ్యమంత్రి మూర్ఖుడు అంటూ జేసీ సంచలన కామెంట్స్..!!

వాస్తవం ప్రతినిధి: అనంతపురం టిడిపి నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూర్ఖుడు ..ఆయన మూర్ఖత్వం వల్లే కాంగ్రెస్ కు దూరం అయ్యాడు అని , అదే మూర్ఖత్వంతో ఇప్పుడు సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం అవుతున్నాడు అంటూ జగన్ ని ఒక మూర్ఖ స్వభావి గా కామెంట్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న సమయంలో ఆ సమయంలో ఉన్న రాష్ట్ర ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా ఏపీ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఒక కులం పై మరియు అదే విధంగా ఒక వ్యక్తి పై ద్వేషంతో ఏపీ ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి రెడీ అయ్యాడని వైయస్ జగన్ నాయకత్వం పై ఆయన తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ దివాకర్ రెడ్డి. అమరావతిని రాజధానిగా ఉంచాలని ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.