నిర్ణయాత్మక మూడో వన్డే..స్మిత్ సెంచరీ…

వాస్తవం ప్రతినిధి: నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బౌలర్లను ఆసీస్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. టీమిండియా బౌలర్లపై దాటిగా ఆడిన స్మిత్ (100 పరుగులు, 117బంతులు, 11 ఫోర్లు)లతో సెంచరీ నమోదు చేశాడు. స్మిత్ తన కెరీర్ లో 9వ శతకం నమోదు చేశాడు. నవదీస్ షైనీ వేసిన 44 ఓవర్ మూడో బంతిని సింగిల్ తీసి శతకం సాదించాడు. ఆలెక్స్ కారే (35, 36బంతుల్లో 6X4 ) పరుగులతో వేగంగా ఆడాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శ్రేయస్స్ అయ్యారుకు క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. మరోవైపు స్మిత్, టర్నర్‌ క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లలో ఆసీస్ 200 పరుగుల దాటింది. 43.4 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి ఆస్టేలియా 237 పరుగులు చేసింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉండడం మరో 5 ఓవర్లు మిగిలి ఉండడంతో ఆసీస్ 3వందల పరుగుల దాటే అవకాశం ఉంది. దీంతో భారత్ ముందు భారీ విజయలక్ష్యం ఉంచే అవకాశం కనిపింస్తుంది.