మరోసారి హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు ..!!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి మంచి గుర్తింపు గతంలో అనేక సార్లు లభించింది. గతంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ బిజినెస్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న చాలామంది కుబేరులు బిజినెస్ మ్యాన్ లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్ నగరం మారుమోగిపోయింది ఇంటర్నేషనల్ రేంజులో.

ఇదిలా ఉండగా తాజాగా 2020 సంవత్సరానికి గాను ప్రపంచంలోని 20 టాప్ నగరాలలో మొదటి స్థానంలో నిలిచిన రికార్డు పొందింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను ఆయా విషయాలలో అద్యయనం చేసిన తర్వాత ఈ ర్యాంక్ ఇచ్చారు. జేఎల్ఎల్(జోన్స్ ల్యాంగ్ అనే సంస్థ జరిపిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది.

దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా దక్షిణాది నగరాలు అత్యుత్తమ పనితీరుతో ముందుకెళ్తున్నాయని తెలిపింది. వేగంగా పట్టణీకరణ, పర్యావరణ ఇబ్బందులు, అధిక రద్దీ, సామాజిక అసమానతలు, సొంతిళ్ల కొరత, భద్రత, అందరికీ అందుబాటులో సేవలు పెద్ద సవాళ్లుగా మారాయని అభిప్రాయపడింది.