ఆ విషయంలో పులివెందుల అయినా అమరావతి అయినా ఒకేలా ఉండాలి అంటున్న జగన్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో అదేవిధంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు భరోసా ఇస్తూ అమ్మ ఒడి అనే పథకాన్ని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అధికారంలోకి వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలు చేయడం జరిగింది. ఇదే తరుణంలో మధ్యాహ్న భోజన పథకంలో స్కూల్ లో ఉండే విద్యార్థులకు కొత్త మెనూ ప్రవేశపెడుతూ ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం గట్టిగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో తాజాగా అధికారులతో వైయస్ జగన్ సమావేశమైన సందర్భంలో పౌష్టిక ఆహార విషయంలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో పులివెందులలో అయినా అమరావతిలో అయినా క్వాలిటీ ఒకేలా ఉండాలని జగన్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజన పథకానికి వైయస్ జగన్ సర్కార్ 1300 కోట్ల రూపాయలను విడుదల చేయటానికి రెడీ అయ్యి ఈ నెల 21 నుండి పథకం ప్రారంభం అవటానికి జగన్ సర్కార్ ముందడుగు వేసినట్లు సమాచారం.