రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ తో అడుగులు వేస్తున్న బిజెపి..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల జాతీయ పార్టీ బిజెపి పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే బిజెపి పార్టీ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మెరుగైన స్థితిలో ఉండటంతో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ నాయకులతో చర్చలు జరిపిన సందర్భంలో ఈ విషయం గురించి ఎక్కువగా చర్చించుకున్నట్లు త్వరలో జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో బలంగా ఉపయోగించడానికి రెడీ అయినట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది.