సాయిబాబా పై రాజకీయాలా..? విజయ్ చందర్

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం శిరిడీ సాయిబాబా ఆలయ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్ స్పందించారు. అసలు ఇప్పటివరకూ శిరీడీ సాయి నాథుడు ఎలా పుట్టారో ఎవరూ కనిపెట్టలేకపోయారన్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి శిరిడీ సాయిబాబా ఆలయం కొనసాగుతోందని.. నిన్నగాక మొన్న వచ్చిన ఈ ప్రభుత్వం ఎలా తొలగించగలదని ప్రశ్నించారు. ఇప్పుడు సడన్‌గా సాయి ఆలయాన్ని మార్చాలని వారికి ఎందుకనిపించిందన్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. నిజంగానే ఒక రాత్రిలో శిరిడీ సాయి బాబా.. జన్మించి ఉంటే ఇప్పటివరకూ.. ఆ స్థలానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ చందర్.