అమెరికాలో దారుణం…భారత సంతతి యువతి మృతి!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో ఇటీవల జరుగుతున్న వరస ఘటనలతో భారత్‌లో కొంచెం అంతర్మథనం నెలకొంది. అమెరికా వెళ్లాలంటే భారత్‌కు చెందిన వారు భయపడిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మరో ఘటన జరగడంతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. అమెరికాలో గత నెల 30న అదృశ్యమైన భారత సంతతికి చెందిన మహిళ సురీల్‌ దాబావాలా (34) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షికాగోలోని పశ్చిమ గార్‌ఫీల్డ్‌ పార్క్‌ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి ఆమె సొంతకారు డిక్కీలోనే పడేసి ఉంది. సురీల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియకపోయినా కొందరు అనుమానితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ ఎన్నారై కుటుంభానికి చెందిన ఆమె పేరు సురీల్ దాబావాలా.ఆమె తండ్రి, తల్లీ ఇద్దరూ అమెరికాలో ప్రముఖ డాక్టర్లు పనిచేస్తున్నారు.