వైస్సార్సీపీ పార్టీ కి భయం మొదలయింది..!

వాస్తవం ప్రతినిధి: ఈ నెల 16 తారీఖున్నఅ బీజేపీ, జనసేన పార్టీ అగ్ర నాయకుల భేటీ జరుగుతున్న తరుణం లో వైస్సార్సీపీ పార్టీ భయపడుతుంది అని టిడిపి కి మద్దతుగా ఉండే పత్రిక ఒకటి కథనం ప్రచురించింది. ఈ సందర్బంగా పదహారున రెండు పార్టీలకు సంబందించి కలిసి పనిచేయడంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అయితే జివిఎల్ నరసింహరావు వంటి బిజెపి నేతలు జనసేన విలీనం కావాలని అన్నారు.ఆ విషయాన్ని ఆ పత్రిక ప్రస్తావించలేదు. జగన్ దూకుడును కట్టడి చేయాలంటే కమలం పార్టీతో జట్టుగా వెళ్తే మంచిదని పవన్ భావిస్తున్నట్టున్నారని ఈ పత్రిక తెలిపింది. అందుకే పవన్ బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారు. రాష్ట్ర పరిస్థితులను వాళ్లకు వివరిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తుండటంతో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బెటర్ అనే అభిప్రాయం కూడా రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. మరోవైపు పవన్ ఢిల్లీ పెద్దలను కలవడంపై వైసీపీలో గుబులు మొదలైంది. బీజేపీ, జనసేన కలిస్తే తమకు కొంచెం ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వినిపిస్తోందని ఈ పత్రిక రాసింది.