అలా జరగకపోయి ఉంటే..ఇప్పుడు హాయిగా ఉండేవాళ్లు : కెనడా ప్రధాని

వాస్తవం ప్రతినిధి: ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది మరణించారు. ఇక వీరిలో 63 మంది కెనడియన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సంతాప సభకు హాజరైన ట్రూడో మాట్లాడుతూ.. “మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు లేనట్లయితే ఆ ఘటనలో మృతి చెందిన కెనడియన్లు.. ప్రస్తుతం వారి వారి కుటుంబాలతో కలిసి ఇంట్లో హాయిగా ఉండేవారు అని చెప్పారు. అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనకుండా ఉన్నట్లయితే ఉక్రెయిన్‌ విమాన దుర్ఘటన జరిగేది కాదని కెనడా ప్రధాని జిస్టిన్‌ ట్రూడో అన్నారు. ఇరు దేశాల పరస్పర ప్రతీకార దాడుల వల్ల ఎంతో మంది మృత్యువాతపడ్డారని విచారం వ్యక్తం చేశారు “.