ఇరాన్‌తో జపాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు

వాస్తవం ప్రతినిధి: ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించనున్నట్టు జపాన్‌ ప్రధాని షింజో అబే అన్నారు. ఐదురోజుల పర్యటన కోసం షింజో అబే గల్ఫ్‌ పర్యటనకు వచ్చారు. సోమవారం సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జపాన్‌, సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే అమెరికా మిత్రదేశమైన జపాన్‌ నుంచి ఇలాంటి స్పందన వెలువడం గల్ఫ్‌ దేశాల్లో చర్చనీయాంశమైంది. అనంతరం ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖాసీం సులేమానిని క్షిపణుల దాడులతో అమెరికా హతమార్చిన అనంతరం మధ్యప్రాఛ్యంలో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాధినేతలు చర్చించారు. ఇరాన్‌పై యుద్ధానికి జపాన్‌ సహకరిస్తోందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము ఇరాన్‌తో యుద్ధం కోరుకోవడంలేదని అన్నారు. చమురు దిగుమతులపై తాము ఇరాన్‌పైనే ఆధారపడి ఉన్నామని అన్నారు. ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి స్థాపన జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.