ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడి కావాలి: పాక్‌‌‌‌‌‌‌‌ హిందువులు

వాస్తవం ప్రతినిధి: పాక్ రాజధాని ఇస్లామాబాదులో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఫెడరల్‌‌‌‌‌‌‌‌ కేపిటల్‌‌‌‌‌‌‌‌లో ఒక్క ఆలయం కూడా లేదని హిందూ పంచాయత్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. దేవుడ్ని ప్రార్థించేందుకు, పూజలు చేసేందుకు ఒక సొంత ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఉండటం రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పారు. ఇస్లాబామాబుదాలు సుమారు 800 మంది హిందువులు నివసిస్తున్నారు. ఆలయం లేక దీపావళి వంటి పెద్ద పండుగలను ఇళ్ల వద్దే జరుపుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అక్కడ హిందువుల కోసం ప్రత్యేకంగా శ్మశానవాటిక కూడా లేదు. మృతి చెందిన వారిని రావల్పిండి లేదా తమ స్వస్థలాలకు తీసుకొచ్చి ఖననం చేయాల్సి వచ్చేది. ఇస్లామాబాద్‌, రావల్పిండి జంటనగరాల్లోని పెద్ద దేవాలయం అంటే సద్దార్‌లో ఉన్న కృష్ణ మందిర్‌ ఒక్కటే. 2016 లో కాపిటల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ హిందూ ఆలయం కోసం స్థలాన్ని కూడా కేటాయిచింది. అయితే అప్పట్లో డబ్బులు లేక గుడి కట్టించలేదని హిందూ పంచాయత్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.