జట్టు అవసరాల కోసం కోహ్లీ త్యాగం!

వాస్తవం ప్రతినిధి: శ్రీలంకతో టీ20 సిరీస్ గెలిచి ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించిన భారత్.. ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ముగ్గురు అందుబాటులో ఉండటంతో తుదిజట్టులో ఎవరిని ఆడించాలనే అంశం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఏ ఇద్దరూ బరిలోకి దిగిన మరొకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే ఈ ముగ్గురు బరిలోకి దిగే అవకాశం కూడా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలపడం, అవసరమైతే జట్టు అవసరాల కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చకుంటానని చెప్పడం చర్చనీయాంశమైంది.