వాస్తవం ప్రతినిధి: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలను మట్టికరిపించిన భారత్‌కు అసలైన సమరం ముందుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు టీమిండియాకు అసలు సవాల్ విసరనుంది. ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత బలమైన ప్రత్యర్థితో తలపడని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పోరుకు సన్నద్ధమైంది.సెమీస్‌లోనే ఓడిన ఆసీస్.. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ వన్డే బరిలోకి దిగుతోంది. పూర్తి స్థాయి జట్టుతో కంగారూలు పటిష్టంగా కనిపిస్తుండగా.. స్వదేశంలో కోహ్లీసేన ఏ రకంగా చూసినా బలమైనదే. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ఆ-స్ట్రేలియా తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.