అప్పటినుండి నవదీప్ అంటే నా వైఫ్ కి చాలా ఇష్టం..అంటున్న త్రివిక్రమ్…!!

వాస్తవం సినిమా: సంక్రాంతి పండుగ సందర్భంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సినిమా యూనిట్ మాత్రం ప్రస్తుతం సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ సందర్భంగా నవదీప్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆడియన్స్ ని నవ్విస్తున్నాయి. ముందుగా మైక్ తీసుకొని తన చిత్రబృందాన్ని ఒక్కొక్కరుగా గుర్తు చేసుకుంటూ వారి గురించి గొప్పగా మాట్లాడారు త్రివిక్రమ్. ఈ క్రమంలో నవదీప్ పేరు మర్చిపోయారు. వెంటనే తేరుకొని.. మైక్ తీసుకున్నాడు. ”నవదీప్ గురించి మాట్లాడకపోతే తనేం.. ఫీల్ అవ్వడు.. పాపం మంచోడు.. కానీ మా ఆవిడ మాత్రం ఫీల్ అవుతుందని” అన్నాడు త్రివిక్రమ్. తన భార్య, కొడుకు నవదీప్ కి ఫ్యాన్స్ అని.. బిగ్ బాస్ షోలో నవదీప్ ని చూసినప్పటి నుండి అతడిని అభిమానించడం మొదలుపెట్టారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్యారిస్ లో జరుగుతున్నప్పుడు నవదీప్ ని చూడడం కోసమే తన భార్య ప్యారిస్ వచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.