చిరంజీవి నాకు మధ్య ఎటువంటి గొడవలు లేవు అంటున్న విజయశాంతి..!!

వాస్తవం సినిమా: మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో దాదాపు 13 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాకి సంబంధించి సక్సెస్ సమావేశాలలో చాలా చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా సినిమాలో తన క్యారెక్టర్ గురించి చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు రావడం గురించి మాట్లాడుతూ పెద్దగా కొత్తగా ఏమీ అనిపించలేదు అని విజయశాంతి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కృష్ణ గారి కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడం కృష్ణ గారు అంటూ విజయశాంతి మాట్లాడుతూ మహేష్ చిన్నప్పుడు చూడటం జరిగిందని కాని సూపర్ స్టార్ అయ్యాడు ఏ విధంగా ఉంటాడో అన్న సందేహం లో మొదటి రోజు తనతో మాట్లాడిన సందర్భంలో తన సందేహాలన్నీ పోయాయి అంటూ విజయశాంతి మాట్లాడుతూ షూటింగ్ సమయంలో మహేష్ ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపారు. ఇంక రాజకీయాల్లో కోపం పెరిగిపోతుందని సినిమా రంగంలో ఉన్నప్పుడు మన:శాంతి గా ఉంటుందని షూటింగ్ చేస్తున్నంతసేపు నవ్వుకున్నాం అని విడుదలకు ముందు వేడుకలో చిరంజీవి ని కలవడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో చిరంజీవిగారితో దూరం పెరిగిందని ఆ వేడుక తరువాత ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్దలన్నీ తొలగిపోయాయని విజయశాంతి చెప్పుకొచ్చారు.