పవన్ కళ్యాణ్ తో పూజ హెగ్డే..??

వాస్తవం సినిమా: పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ పింక్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఇటీవల వార్తలు రావడం జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా చేయటానికి పూజా హెగ్డే చాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇదే తరుణంలో కొంత మంది డైరెక్టర్లు మరియు నిర్మాతలు చేస్తున్న కామెంట్లు కూడా వస్తున్న వార్తలు వాస్తవమే అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మందిని ప్రయత్నించినట్లు కానీ చివరాకరికి ఆ చాన్స్ పూజా హెగ్డే దక్కించుకున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక సాంగ్ కంపోజ్ అయినట్లు న్యూస్ వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కంపోజ్ చేసిన డ్యూయెట్ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలో అని నిర్మాతలు ఆలోచిస్తుండగా పూజ హెగ్డే గురించి ఆలోచించారట. వరుస సినిమాల విజయాల తో దూసుకుపోవడం మాత్రమే కాకుండా, పూజ హెగ్డే ప్రత్యేక పాటలకు, చిన్న పాత్రలకు కూడా ఒప్పుకుంటుంది అని గతంలో తాను చేసిన సినిమాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మరి పవన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర చేస్తుందో లేకపోతే స్టెప్పులు వేస్తుందో చూడాలి.