బాలయ్య బాబు- బోయపాటి సినిమాలో సరికొత్త ట్విస్ట్..!!

వాస్తవం సినిమా: వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో బోయపాటి తో చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. విషయంలోకి వెళితే ఇటీవల బాలయ్య బాబు నటించిన సినిమా ‘రూలర్’ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా రాంప్రసాద్ పని చేశాడు. దీంతో బోయపాటి సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ని తీసుకోవాలని భావించారు బోయపాటి. అయితే ‘రూలర్’ సినిమా దారుణంగా ఫ్లాప్ కావటంతో…బాలయ్య బాబు వెంటనే సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ని తప్పించాలని బోయపాటికి ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే బోయపాటి సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ని చేయబోయే ప్రాజెక్టు నుండి తప్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. బోయపాటి తో తీయబోయే సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని బాలయ్య బాబు సినిమాకి సంబంధించి అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.