బన్నీ కి లెటర్ పంపిన పవన్ కళ్యాణ్..!!

వాస్తవం సినిమా: సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అన్ని సినిమాల కంటే మంచి ఆదరణ దక్కించుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బన్నీ కి శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ తో పాటు ఫ్లవర్‌ బోకే పంపించడం జరిగింది. అంతేకాకుండా సందేశ రూపంలో గౌరవనీయులైన అల్లు అర్జున్‌ గారు, అల వైకుంఠపురములో సినిమాలో ఘనవిజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాలకు ఆల్‌ ది బెస్ట్ అంటూ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా ఓ లెటర్‌ రాసి పంపించాడు. అయితే ఈ లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన బన్నీ పవన్‌ కళ్యాణ్‌ గారి నుంచి శుభాకాంక్షలు రావటం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్‌ పవన్‌ కళ్యాణ్‌ గారు అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.