ఉద్యమం చేస్తానంటున్న ఏపీ స్పీకర్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా విశాఖ పట్టణంలో ఆర్థిక రాజధాని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని జగన్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. దీంతో చాలా మంది రాజకీయ మేధావులు సీనియర్ పొలిటికల్ లీడర్లు విశాఖపట్టణం ఆర్థిక రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రమంలో వికేంద్రీకరణ కు విరుద్ధంగా మూడు రాజధానుల కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు అమరావతి లో మాత్రమే రాజధాని ఉండాలని ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఏపీ స్పీకర్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే విశాఖపట్టణం లో రాజధానికి సహకరించకపోతే అడ్డుకుంటే ఉద్యమం చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆమదాల వలసలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంద్ర వెనుకబాటుతనం పోగొట్టడానికి ఇది ఒక అవకాశం అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్దం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. . విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని సీతారాం అబిప్రాయపడ్డారు. ఇందుకు అందరూ సహకరించాలని అన్నారు. పదమూడు జిల్లాల అబివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని ఆయన వివరించారు.