బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్..!!

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నాదెండ్ల మనోహర్ మరియు పవన్ కళ్యాణ్ కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరియు అనేకమైన సమస్యలను జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశమైనట్లు..చాలా వరకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రహస్యంగా చేపట్టినట్లు ఈ క్రమంలో ఢిల్లీలో బిజెపి పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయి రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ తో జనసేన పార్టీ కలిసి పనిచేయడానికి రెండు పార్టీలకు చెందిన నాయకులు చర్చించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఢిల్లీ పర్యటన అయిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. కాకినాడ ఎమ్మెల్యే తనపై మరియు పార్టీ కార్యకర్తలు పై చేసిన దాడి విషయంపై పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.