నాతప్పు ఉంటే చెప్పుతో కొట్టండి: పృథ్వీ

వాస్తవం ప్రతినిధి: టీటీడీ అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని నిర్వహించి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన కమెడియన్ పృధ్వీ తాజాగా బయటకు వచ్చిన రాసలీలల ఆడియో విషయంలో ఎస్వీబీసీ చైర్మన్ గా రాజీనామా చేశారు. దీనిపై స్పందించిన పృధ్వీ ..

తనది కాని వాయిస్‌తో ప్రచారం చేసి తన వ్యక్తిగత ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారని, శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ)లో పనిచేసే పార్టుటైమ్‌ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లు బయటకు వచ్చిన ఆడియోలోని వాయస్‌ తనది కాదని నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ అన్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశానని, తనపై వచ్చిన ఆరోపనలపై విజిలెన్స్‌తో విచారణ జరిపించి తప్పు ఏమైనా ఉంటే చెప్పుతో కొట్టండని ఆయన అన్నారు.

విచారణ తేలిన అనంతరం ఎస్వీబీసీ కార్యాలయంలోకి అడుగుపెడతానని ఆయన తెలిపారు. తనను బదనామ్‌ చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు శబరిమల యాత్రలో ఉన్న తనకు ఫోన్‌లు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఫేక్‌ వాయిస్‌తో తనపై తప్పుడు ఆరోపనలు చేస్తున్నందుకు తానేంతో బాధపడ్డానని ఆయన తెలిపారు. తానెప్పుడూ పదవుల కోసం వైసీపీలో పనిచేయలేదని, ఎస్వీబీసీ ప్రక్షళనకు కృషి చేశానన్నారు.