అమరావతిలో మగవాళ్లకు దమ్ము లేదా..? : రోజా

వాస్తవం ప్రతినిధి: అమరావతిలో ఆడవాళ్లని ముందుపెట్టి ఉద్యమం చేస్తున్నారని, అమరావతిలో మగవాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ము లేదా? అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ ఆడంగి వెధవల్లాగా వెనక దాక్కుంటున్నారన్నారు. ఆడవాళ్లని రోడ్ల మీదకి వదిలి పోలీసులు కొట్టారంటూ ఏడుస్తున్నారని విమర్శించారు. మీరు చేసిన తప్పులకు ఆడవాళ్లని ఎందుకు బలి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అక్కడ మహిళలంతా స్వార్థంతోనే ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కూకట్‌పల్లి నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారన్నారు. లోకేష్‌ స్నేహితుడైన ఓ డైరెక్టర్‌ మనవాళ్లు హైదరాబాద్‌ నుంచి వెళ్లి ధర్నాలు బాగా చేస్తున్నారని ట్వీట్‌ చేశాడని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తాము సిగ్గుపడుతున్నామన్నారు. నాకు స్వార్థముంటే తిరుపతిలో రాజధాని పెట్టమని కోరేదాన్ని అని పేర్కొన్నారు.