తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలకు మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. గత 7నెలల్లో రైతు సంక్షేమానికి చర్యలు తీసుకున్నామన్నారు. సంక్రాంతిని ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలన్నారు.