జల్లికట్టులో విషాదం..యువకుడు మృతి

వాస్తవం ప్రతినిధి: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం భారత మిట్ట జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. పరుగులు తీస్తున్న ఎద్దును నిలువరించేందుకు ఓ యువకుడు యత్నిస్తుండగా ఎద్దు అతనిపైకి వేగంగా దూసుకువచ్చింది.దీంతో ఎద్దుకొమ్ములు యువకుడి ఛాతీలో గుచ్చుకోవడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే అతని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందారు. ఈ రాక్షస క్రీడలో మరో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.

పోలీసుల అనుమతి లేదని చెప్తున్నా నిర్వాహకులు మాత్రం జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా జల్లికట్టులో ఎంతోమంది మరణిస్తున్న ఈ పోటీలను మాత్రం నిషేధించడంలేదు. నిర్వాహకులు పండగ సందర్బంగా అమాయకుల కుటుంబాల్లో చీకటి నింపుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.