క్షమాభిక్ష కోరడానికి కూడా వారు అర్హులు కారు..!!

వాస్తవం ప్రతినిధి: యూరప్‌లో హౄదయ విషాదకరణ ఘటన చోటుచేసుకుంది. ఇలియా (21), స్టానిస్లా కోస్ట్వ్ (19) ఇద్దరూ అన్నదమ్ములు, ఓ సోదరి యూరప్‌లోని బెలారస్‌లో నివసిస్తున్నారు. సోదరి సంరక్షణ బాధ్యతలను వీరే చూసుకుంటున్నారు. సోదరి సంరక్షణ బాధ్యతల నుంచి తప్పుకుని సోషల్ సర్వీస్‌ చేయాలని టీచర్ నటల్యా కొస్ట్రిస్టా వారిని కోరింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనై, ఆమెను ఎలాగైనా చంపాల్లని నిర్ణయించుకున్ని, టీచర్ ఇంటికి చేరుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేసి, ఆమె ఇంటికి నిప్పంటించారు. పోలీసులుకు దొరక్కుండా ఉండేందుకు.. కత్తిని స్థానికంగా ఉన్న ఓ కాలువలో పడేశారు. విచారణ జరిపి తగిన సాక్ష్యాధారాలతో అన్నదమ్ములిద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు. జడ్జి అన్నదమ్ములిద్దరికీ మరణ శిక్ష విధించారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా సీరియస్‌గా తీసుకోవడంతో.. క్షమాభిక్ష కోరడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది.