ఎన్నికలు ఏవైనా విజయం మాదే : టీఆరెస్ ఎన్నారై

వాస్తవం ప్రతినిధి: పార్లమెంటరీ సెక్రెటరీ ఇంచార్జ్ వరంగల్ (పశ్చిమ) నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నియోజకవర్గ ఎంపీ పసునూరి దయాకర్, వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లతో టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రికా కన్వీనర్ వెంకట్ రావు తాళ్ళపెల్లి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..పురపాలక ఎన్నికల సమరానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉందన్ని, ఈ సమరంలో మనం విజయం సాధించాలంటే ఈ క్షణం నుండి ప్రతీ నిమిషం మనకు చాలా ముఖ్యమన్ని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలును కోరారు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు.