పంత్‌ పై విక్రమ్‌ రాఠోడ్‌ ప్రశంసలు

వాస్తవం ప్రతినిధి: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మంచి ఆటగాడు. ఆ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే అని బ్యాటింగ్ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఇటీవల జరిగిన మీడియా సమావేశాల్లో పంత్‌ గురించి మేం ఎంతో మాట్లాడాం. నేను కూడా అతడి గురించి ప్రశ్నలు ఎదుర్కొన్నా. పంత్ మంచి ఆటగాడు. ఆ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ప్రస్తుతం పంత్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నాడు. దాని కోసం శ్రమిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఇటీవల మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. భవిష్యత్తులో మరింత నిలకడగా రాణిస్తాడు’ అని విక్రమ్‌ తెలిపాడు.