వైసీపీ పార్టీకి స్థానిక ఎన్నికలలో సగం శాతం కూడా ఓట్లు రావు..!!

వాస్తవం ప్రతినిధి: సిపిఐ కార్యదర్శి కే రామకృష్ణ ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి పార్టీ కనీసం 50 శాతం కూడా ఓట్లు సాధించలేదని సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ జోస్యం చెప్పారు. రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. రాజధాని అంశం రాకముందు, ప్రతిపక్షాలలో కొంత స్తబ్దత ఉండేదని, ఈ సమస్య వచ్చాక ప్రతిపక్షాలు యాక్టివ్ అవడమే కాకుండా ,స్థానిక ఎన్నికలలో కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని అబిప్రాయపడ్డారు. తెలుగుదేశం కు 40 శాతం ఓట్లు, జనసేనకు ఆరు శాతం ఓట్లు, వామపక్షాలకు ఒక శాతం ఓట్లు ఉన్నాయని, అన్ని కలిసి పోటీచేస్తే వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ కు గట్టి పోటీ అవుతుందని, స్థానిక ఎన్నికలలో గణనీయం ఫలితాలు పొందవచ్చని ఆయన అబిప్రాయపడుతున్నారు. స్తానిక సంస్థల ఎన్నికలు జగన్ కు అంత తేలిక కావని కే రామకృష్ణ పేర్కొన్నారు.