ఈ వెడ్డింగ్ హాల్లో పెళ్లి ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు…కానీ

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్ లో ఓ వెడ్డింగ్ హాల్ ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. బహావల్పూర్ కు చెందిన ఓ వెడ్డింగ్ హాల్ ఓనర్ తమ వెడ్డింగ్ హాల్ లో పెళ్లి చేసుకునే దంపతులకు ఆఫర్ ప్రకటించాడు. తన వెడ్డింగ్ హాల్లో రెండోసారి పెళ్లి చేసుకుంటే 50శాతం డిస్కౌంట్, మూడోసారి పెళ్లి చేసుకుంటే 75శాతం డిస్కౌంట్, నాలుగో సారి పెళ్లి చేసుకునే దంపతులకు ఫ్రీగా తామే పెళ్లి చేస్తామని ప్రకటించారు. కానీ ఓ షరతు విధించాడు. ఎవరైనా రెండో సారి పెళ్లి చేసుకునే భర్తకి తన మొదటి భార్యే ఈ హాల్ ను బుక్ చేయాలి. అలా ఎవరైతే బుక్ చేస్తారో వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెడ్డింగ్ హాల్ ఓనర్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ హాల్ డిస్కౌంట్ నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది.