‘అల వైకుంఠపురములో’ మూవీ రివ్యూ –

  రేటింగ్: 3.5/5
నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, సుశాంత్, నివేత పేతురాజ్, టబు..
నిర్మాత: రాధాకృష్ణ – అల్లు అరవింద్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్
మ్యూజిక్: ఎస్ థమన్
ఎడిటర్‌: నవీన్ నూలి
రన్ టైం: 2 గంటల 45 నిముషాలు  

గత సినిమా నా పేరు సూర్య తో భారీ ప్లాప్ మూటగట్టుకున్న హీరో అల్లూ అర్జున్ తన కొత్త సినిమా తీయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకున్నా కూడా మొదటి నుంచీ మంచి ప్రమోషన్ తో – మంచి టీం తో బన్నీ ఫామిలీ ప్రేక్షకులనే టార్గెట్ గా సంక్రాంతి కి బరిలోకి దిగాడు. ట్రెయిలర్ దగ్గర నుంచి పాటల విషయం వరకూ సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ థియేటర్ లో ఏ మేరకు తన చిత్రాన్ని సక్సెస్ చేసుకోగలిగాడు .. ఈ సినిమా కథ ఏంటి .. అరవింద సమేత తరవాత మంచి కం బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ తన గ్రిప్ మళ్ళీ కంటిన్యూ చేయగలిగాడా అనేది చూద్దాం రండి .

కథ – విశ్లేషణ :

అల్లూ అర్జున్ – సుశాంత్ లని చిన్నతనం లోనే మార్చేస్తాడు మురళీ శర్మ .. బాగా డబ్బున్నవాళ్ల ఇంట్లో సుశాంత్ ఉంటే మిడిల్ క్లాస్ ఇంట్లో పడతాడు హీరో అల్లూ అర్జున్. మిడిల్ క్లాస్ లైఫ్ బతకలేక , తండ్రి ని విలన్ గా ఫీల్ అవుతున్న హీరోకి అతని గతం ఎలా తెలిసింది ? మరి అతని సొంత స్థానం లోకి అతను ఎలా వెళ్ళాడు అనేది ఈ సినిమా కథ . అల్లూ అర్జున్ మ్యానరిజమ్స్ దగ్గర నుంచి వేరియెషన్స్ వరకూ ఒన్ మ్యాన్ షో గా సాగుతుంది సినిమా. అంతా పెద్ద తారాగణం ఉన్నా కూడా సినిమా మొత్తం అల్లూ అర్జున్ స్టయిల్ తోనే సాగుతుంది. కామెడీ + యాక్షన్ + ఎంటర్టైన్మెంట్ లో తన కి ఉన్న ఫుల్ టాలెంట్ ని త్రివిక్రమ్ ఈ సినిమా తో బయటకి తీశాడు . అసలు సినిమా మొదలైన ముప్పై నిమిషాల్లో త్రివిక్రమ్ తన మార్క్ ని చూపించే ప్రయత్నం లో సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాడు. డైలాగులు అయితే ఆపకుండా తన పెన్నుకి పని చెబుతూనే ఉన్నాడు త్రివిక్రమ్. ఏ ఫామిలీ డ్రామాల జోనర్ తీయడం లో త్రివిక్రమ్ పర్ఫెక్ట్ అని అందరూ అంటారో అదే కథ ఎంచుకుని బ్లాక్ బస్టర్ కథనం అందించాడు. ఫామిలీ ఆడియన్స్ కి బాగా కనక్ట్ అయ్యేలా ఎమోషన్లని జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు ..సినిమా హిట్ అవ్వడానికి సంక్రాంతి సీజన్ లో కావాల్సిన ఫామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా తో బాగా రప్పించుకోగలిగాడు.

పాజిటివ్ లు :

తేలికైన , చిన్నదైన కథ ని త్రివిక్రమ్ నడిపించిన విధానం – హీరో ని ఇలాంటి కథ లో హైలైట్ చేసిన విధానం ఈ సినిమా కి ప్రధాన పాజిటివ్ పాయింట్ . స్క్రీన్ ప్లే విషయం లో స్ట్రాంగ్ గా కథనం రాసుకున్నాడు త్రివిక్రమ్ మరియూ అతని బృందం. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్ లని ఎమోషనల్ సీన్ లనీ రక్తి కట్టించింది. మొట్ట మొదటి ఇరవై నిమిషాల్లో ముప్పై డైలాగులు వదిలి అబ్బురపరిచాడు త్రివిక్రమ్. డైలాగులు రాయడం లో ఆయనని తీసిపారేసే మొనగాడు లేడు అని త్రివిక్రమ్ మళ్ళీ నిరూపించుకున్నాడు . కామెడీ , సెంటిమెంట్ , డాన్స్ లూ , ఫైట్ లూ , సెటైర్ లూ ఇలా సినిమా కి ఆయువుపట్టుగా అల్లూ అర్జున్ చెడుగుడు ఆడేశాడు . పూజా హెగ్డే కూడా చాలా చక్కగా చేసింది.

నెగెటివ్ లు :

తారాగణం విషయం లో ఎక్కువమందిని సినిమా లో ఇరికించినట్టు అనిపిస్తుంది. కామెడీ పరంగా సునిల్ ని ఇంకా బాగా వాడుకోవచ్చు. లాజిక్స్ చాలా చోట్ల మిస్ చేశారు . సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కాస్తంత స్లో గా ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ గా చెప్పచ్చు .

మొత్తం గా :

అల్లూ అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ తమని తాము నిరూపించుకోవాల్సిన దశ ఇది . దానికి సంక్రాంతి కంటే మంచి సీజన్ లేదనే చెప్పాలి. కథ పాతదే ఐనా మంచి కథనం కొత్తగా తన మార్క్ ని చూపించిన త్రివిక్రమ్ భారీ స్థాయి లో బన్నీ కి హిట్ ఇచ్చాడు .. ఓవర్ సీస్ దగ్గర నుంచి ఇండియన్ మార్కెట్ వరకూ ప్రేక్షకులని బాగా రంజింపజేసే సినిమా ఇది . అత్తారింటికి దారేది లాంటి మరొక వండర్ఫుల్ చిత్రం త్రివిక్రమ్ ఇచ్చేశాడు అని మనస్పూర్తి గా చెప్పచ్చు . పాటల దగ్గర నుంచి ఎమోషనల్ సీన్ల వరకూ అన్నీ బాగా కుదిరాయి. సంక్రాంతి విన్నర్ గా అల నే నిలుస్తుంది అనడం లో సందేహం లేదు .
                                                                  ….పాంచజన్య