సీఎం కేసీఆర్ ను క్షమాపణలు కోరిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల అంశంపై చర్చించేందుకు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని భావించిన సీఎం కేసీఆర్… ఇందుకు సంబంధించి ముందుగానే వారికి సమాచారం అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకోవాలని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం నేడు ఉదయం ఆలస్యంగా సమావేశానికి రావడం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగించాయి. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సమావేశానికి ఆలస్యంగా రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన లేకపోతే కష్టమని వార్నింగ్ ఇచ్చారట. కీలకమైన మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంపై ఇదేనా మీ నిబద్దత అంటూ ప్రశ్నించడమే కాదు, సీఎంకు ఇలానేనా విలువివ్వడం.. అంటూ ఫైరయినట్టు సమాచారం. దీంతో నాలుక కరుచుకున్న నేతలు..మరోసారి ఇలా రీపీట్ కాదంటూ సారీ చెప్పారని తెలుస్తోంది.