దర్బార్..మూవీ రివ్యూ :

  రేటింగ్ 2.5/5

ఈ దేశం లో ఎంతమంది హీరోలు ఉన్నా , ఎంతమంది లెజెండ్ లు ఉన్నా, ఎంతమంది గొప్ప నటులు ఉన్నా .. ప్రతీ సినిమా ప్రేమికుడినీ సక్సెఫుల్ గా అబ్బురపరిచేది రజినీకాంత్ మాత్రమే. అలాంటి రజినీకాంత్ వినూత్న సినిమాల, కమర్షియల్ హంగుల డైరెక్టర్ మురగదాస్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది ? అదే దర్బార్ .. ఈ సినిమా కోసం తమిళ – తెలుగు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ట్రెయిలర్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా థియేటర్ లలో ఏ మేరకు రాణిస్తుంది అనేది చూద్దాం రండి.

కథ – విశ్లేషణ :

ముంబై పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలిచే పాత్రలో ఆదిత్య అరుణాచలం ఉంటాడు. పోలీసుల జోలికి ఎవరు వచ్చినా ఊరుకోని మనస్తత్వం అతనిది , అదే సమయం లో పబ్లిక్ ని పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అనే చెబుతూ ఉంటాడు. ఇలాంటి నేపధ్యం లో విలన్ సునిల్ శెట్టి ఎంటర్ అయ్యి పోలీసులనే టార్గెట్ చేసుకుంటాడు. పోలిటికల్ లీడర్ల చేతిలో కింగ్ గా ఉండే విలన్ – రజినీకాంత్ తో ఢీ అంటే ఢీ కొట్టే సందర్భం లో ఇంటర్వల్ గ్యాప్ వస్తుంది. ఈ బ్లాక్ ని చాలా బాగా డిసైన్ చేశాడు డైరెక్టర్ . ఈ గ్యాప్ లో నయనతార పరిచయం అవుతుంది. స్టోరీ అంతా రొటీన్ గానే సాగుతుంది అని చెప్పచ్చు. అయితే మురుగదాస్ తనదైన శైలి లో ఒక మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఆ స్క్రీన్ ప్లే ఎంతవరకూ వర్క్ అవుతుంది అనేది చెప్పలేం.. ఎందుకంటే ఇది అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ సంగతి చూస్తే సెంటిమెంట్ సీన్ లూ, ఫ్లాష్ బ్యాక్ అంశాలు కొన్ని జోడించారు. నివేథ థామస్ రజినీకాంత్ కూతురు గా చేసింది. ఆమె కి సంబంధించినదే సినిమా లోని ఫ్లాష్ బ్యాక్ సీన్లు అన్నీ .. రజినీకాంత్ యంగ్ లుక్ తో ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేశాడు. హీరోయిన్ – హీరో ల మధ్య సన్నివేశాలు కూడా బాగా రాసుకున్నారు. యోగిబాబు – రజినీకాంత్ మధ్య కామెడీ సీన్ లు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. ఫైట్స్ లో కానీ డాన్స్ లలో కానీ రజినీకాంత్ ఎందుకు సూపర్ స్టార్ అనేది మళ్ళీ నిరూపించుకున్నాడు. క్లైమాక్స్ విషయం లో మురుగదాస్ ఇంకా బాగా ప్లాన్ చేసి ఉండాల్సింది .

పాజిటివ్ లు ::

ఫాన్స్ కోసం చాలా సీన్ లు ఉన్నాయి

యోగిబాబు కామెడీ

రజినీకాంత్ లుక్స్ , నటన

ఇంటర్వల్ బ్యాంగ్

నేపధ్య సంగీతం

మైండ్ గేమ్ స్క్రీన్ ప్లే

మంచి మెసేజ్

నెగెటివ్ లు ::

హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ

ఫైట్స్ లో ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉండడం

వీక్ ఎడిటింగ్

మొత్తంగా :

మొత్తంగా చూసుకుంటే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో లక్షల్లో – కోట్లలో ఉన్న రజినీకాంత్ అభిమానులు ఈ సినిమా ని ఎంజాయ్ చెయ్యగలుగుతారు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే తో మురుగదాస్ ఈ సినిమాని లాక్కొచ్చాడు. యోగిబాబు కామెడీ వర్క్ అయ్యింది . అయితే క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి, మెసేజ్ ఇవ్వడం లో సక్సెస్ఫుల్ ఐనా కథ చాలా రోటీ అవ్వడమే ఈ సినిమాకి మైనస్ పాయింట్. తమిళనాట బ్లాక్ బస్టర్ అవుతుంది .. తెలుగు లో మూడు సినిమా ల పోటీ లో నిలబడడం కష్టమే !!

                                                    ..పాంచజన్య