ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చు: జేసీ

వాస్తవం ప్రతినిధి: రాజధానిని ముక్కలు చేసుకుంటూ పోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కావాలంటే కడపలో పెట్టుకో.. లేకపోతే పులివెందులలో పెట్టుకోమని ఆయన సూచించారు. విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందన్నారు. రాజధానిని మార్చడం అంత సులభం కాదని చెప్పారు. రాజధాని అమరావతిలో ఉండాల్సిందే.. మరో మార్గం లేదన్నారు. తాత్కాలికం..తాత్కాలికం అంటూ..చంద్రబాబు పిచ్చి పని చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని జేసీ వ్యాఖ్యానించారు. రాజధానిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న భవనాలను తాత్కాలికమని చంద్రబాబు చెప్పారన్నారు. రాయలసీమకు హైకోర్టు వస్తే ఏం లాభం..?..పది జిరాక్స్‌ షాపులు వస్తాయన్నారు.