బెంగాల్ లో ఉద్రిక్తం గా మారిన భారత్ బంద్

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ రోజు భారత్ బంద్ దేశవ్యాప్తంగా సాగుతోంది.   పశ్చిమ బెంగాల్ లో భారత్ బంద్ హింసాత్మకం గా మారింది. అక్కడ రోడ్డు రైలు మార్గాలపై కార్మికులు భైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల నాయకులు కార్మికులు బెంగాల్ లో భారీ ర్యాలీలు తీస్తూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలను మూసివేయించారు. రోడ్లు, రైళ్లను దిగ్బంధించారు. దీంతో ఉత్తర బెంగాల్ లోని 24 జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌లపై అరటి ఆకులను పడేశారు.

కూచ్ బిహార్‌లో ఆందోళనకారులు ఓ బస్‌ను ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలోకి బస్సు రాగానే దానిపై రాళ్లు రువ్వి, దాని అద్దాలను పగులకొట్టారు. దీంతో అందులోని ప్రయాణికులు వణికిపోయారు. అనంతరం బస్సు దిగి వెళ్లారు. బస్సుపై దాడి చేసిన యువకులు ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు

 కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ చెప్పారు.