పౌరసత్వ బిల్లు పై అమెరికా యూనివర్సిటీ విద్యార్ధుల నిరసన

వాస్తవం ప్రతినిధి: బీజేపీ సర్కార్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోనే కాకుండా అమెరికాలోని యూనివర్సిటీల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీల విద్యార్ధులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జామియా, అలీగడ్ ముస్లిం వర్సిటీల విద్యార్ధులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.అయితే అక్కడి విద్యార్ధులపై చర్యలు తీసుకున్న నేపధ్యంలో కొన్ని దేశాలలో ఉన్న వర్సిటీలలో ఉంటున్న భారతీయ విద్యార్ధులు నిరసనలు తెలుపుతున్నారు.

అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలైన హార్వర్డ్‌, యేల్‌, స్టాన్‌ ఫర్డ్‌, కొలంబియా వర్సిటీలతో సహా 19 యూనివర్సిటీల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ..యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో భారీ ఎత్తున విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దంగా ఉందని విమర్శించారు.

హార్వర్డ్ విద్యార్ధులు తమ విశ్వవిద్యాలయం నుంచీ ఇండియా గేట్ వరకూ ర్యాలీగా వెళ్తూ నిరసనలు తెలిపారు.తమ తోటి విద్యార్ధులపై అక్కడ దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతో భాదిస్తోందని తెలిపారు.