తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకై ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా జిల్లాల అదనపు సెషన్స్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి.