వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్ధాన్ లాహోర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. దేశ ద్రోహానికి పాల్పడ్డారని నిర్ధారణ కావటంతో మాజీ దేశాధ్యక్షుడు, డిక్టేటర్ పర్వేజ్ ముష్షారఫ్ కు ఉరిశిక్ష విధించటం సంచలనంగా మారింది. తీవ్రమైన రాజద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్ ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఇవాళ తీర్పు చెప్పింది. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. డిసెంబర్ 17 నాటికి ఇరు వైపులా వాదనలు పూర్తైనా, కాకపోయినా తుది తీర్పు వెలువరిస్తామని ప్రత్యేక కోర్టు ఇంతకు ముందే స్పష్టం చేసింది. కాగా అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే.
మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్… ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్… సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.
ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేకంగా 2007 నవంబర్ 3న దేశంలో ఎమర్జెనీ విధించారు. 2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై 2013లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. కేసు విచారణ జరుగుతుండగానే దేశం విడిచి వెళ్లిపోయారు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా దిక్కరించారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది న్యాయమూర్తులను ఆయన ఇళ్లలలోనే నిర్బంధించారు. దాదాపు 100 మందికి పైగా న్యాయమూర్తులను తొలగించి పాలన సాగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది.