యూకేలో దారుణం..300లకు పైగా పగిలిన తలలు..రోడ్డు మీద శవాలు

వాస్తవం ప్రతినిధి: యూకేలోని నార్త్ వేల్స్‌లో హౄదయ విషాదకరణ ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు ఒక్కసారిగా టపటపా నేలపై రాలిపోయాయి. 300 పక్షులకు పైగా కింద పడి చనిపోయాయి. వివరాలోకేల్లితే.. బ్రిటన్‌కు చెందిన హన్నా స్టెవెన్స్ అనే మహిళ ఆస్పత్రి కి వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెకు ఆకాశంలో బోలెడు పక్షులు ఎగురుతూ కనిపించాయి. అన్ని పక్షుల్ని చూసిన హన్నా ఆశ్చర్యపోయింది. అలా వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగొస్తున్న హన్నా స్టెవెన్స్ గుండె గుభేలుమంది. ఎందుకంటే ఇందాక ఆమె చూసిన పక్షులన్నీ రోడ్డుపై తలలు పగిలి పడున్నాయి. అన్ని పక్షుల శవాలను చూసిన హన్నా ఇంటికెళ్లి భయం భయంగా తను చూసిన దృశ్యాన్ని భర్త ఎడ్వర్డ్‌కు తెలియజేసింది. దీంతో ఆందోళన చెందిన ఎడ్వర్డ్ తాను చూసొస్తానని హన్నా చెప్పిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నిజంగానే 300పైగా పిట్టలు తలలు పగిలి, శరీరభాగాలు ఛిద్రమై చనిపోయి ఉండటాన్ని చూశాడు. వెంటనే వాటి ఫోటోలను తీసి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని చనిపోయిన పక్షుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వాటిని ఎవరైనా చంపారా? లేక సహజ మరణమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.