కొడుకు తో సినిమా తీయబోతున్న పవన్ కళ్యాణ్…??

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ కంటే చాలా దీటుగా తయారు చేస్తూ అధికార పార్టీ కి చెమటలు పట్టిస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తనదైన శైలిలో రాజకీయాన్ని చేస్తున్నారు. అయితే ఒక పొలిటికల్ పార్టీ ని నడిపించాలంటే కచ్చితంగా ఎకనామికల్ గా డబ్బు ఉండాలని ఈ నేపథ్యంలో తనకు తెలిసింది డబ్బు సంపాదించాలంటే సినిమా రంగం కాబట్టి తాను నిర్మాతగా మారి తన కొడుకు అయినా రామ్ చరణ్ నీ హీరోగా పెట్టి సినిమాని నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ ప్రైవేటు మీడియా ఛానల్ ఇంటర్వ్యూలు చెప్పినట్లు సమాచారం. మరోపక్క జనసేన పార్టీ కార్యకర్తలు మెగా అభిమానులు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల అధ్యక్షులు ఎవరికి వారు వ్యాపారాలు ఉన్నాయి మీరు సినిమాలు చేయడంలో తప్పులేదు మీరే మళ్ళీ సినిమాలు చేసి అభిమానులను అలరించాలని కోరుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతానికి నిర్మాతగా ఉంటూ సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న టాక్.