రోజురోజుకి దిగజారిపోతున్న టీడీపీ గ్రాఫ్…!!

వాస్తవం ప్రతినిధి: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా చాలా దారుణంగా ఓటమి చెందింది. సాధారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయం నుండి తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఏమిటంటే అది కార్యకర్తల పునాది అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తారు. ఇదే విషయాన్ని చంద్రబాబు మరియు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ సభ జరుగుతున్న సందర్భంలో కార్యకర్తలే పార్టీకి బలం అంటూ చెబుతూ వస్తారు. అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోవటంతో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ తెలుగుదేశం పార్టీపై మరియు కార్యకర్తలపై దాడులు చేస్తుందని ఇటీవల చంద్రబాబు అధికార పార్టీ నేతల చేతుల్లో గాయపడిన మరియు దాడులను ఎదుర్కొన్న వారికి ఆశ్రయం కల్పించడం కోసం గుంటూరు జిల్లాలో పార్టీకి సంబంధించిన న్యాయవాదులతో ఆశ్రయం కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీ పరిస్థితి చాలా దిగజారిపోతున్న నేపథ్యంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే వేరే పార్టీలోకి జంప్ అవడానికి రెడీ అవుతున్న తరుణంలో…మరో పక్క చంద్రబాబు పార్టీ కార్యకర్తలను పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలను పట్టించుకోని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు ఇటీవల కామెంట్లు చేస్తున్నారు. ఇందు మూలంగానే పార్టీకి సంబంధించిన యువత అధ్యక్షులు లేడని అలాగే మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు కూడా ఉన్నాగాని ఆమె ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఈ పరిణామాలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అని కార్యకర్తలు కూడా భయాందోళనలు నెలకొన్నాయి అంటు వార్తలు వినబడుతున్నాయి. కార్యకర్తల విషయంలో మరియు పార్టీకి సంబంధించిన విభాగాలు విషయంలో చంద్రబాబు కళ్ళు తెరవాలని సొంత పార్టీలో ఉన్న నేతలు ప్రస్తుతం కామెంట్ చేస్తున్నారు.