విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యం: జగన్

వాస్తవం ప్రతినిధి: వ్యవస్థలో మార్పుకోసమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సభలో దిశ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యిందన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. నేరం చేసిన ఎంతటి వారినైనా వదలకూడదన్నారు. విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందన్నారు.