కొనసాగుతున్న రైతు సౌభాగ్య దీక్ష

వాస్తవం ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష కొనసాగుతోంది. దీక్షా శిబిరంలో జనసేనాని పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. వారి సమస్యలను పవన్ అడిగి తెలుసుకుంటున్నారు. రైతు సౌభాగ్య దీక్షలో పవన్ కల్యాణ్ గుంటూరు రైతు కృష్ణయ్యతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎంత సంపాదించిన ఉపయోగం లేదని, సాటివాడికి సాయం చేస్తే చాలు అన్న రైతు మాటకు జననేత బైబిల్ కూడా అదే చెపుతుంది అని కితాబు ఇచ్చారు.