ఫ్రిజ్ లో దాక్కున్న ప్రధాని..టీవీలో లైవ్..షాకైన యావత్ దేశం

వాస్తవం ప్రతినిధి: మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న మాట నోరు జారిన అంతే సంగతులు ప్రపంచం మొత్తం మారుమ్రొగిపోతుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సరిగ్గా ఇదే పరిస్ధితి ఎదురైంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జన్సన్ యార్కషైర్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున పర్యటిస్తుండగా..’గుడ్ మార్నింగ్ బ్రిటన్’ టీవీ షో రిపోర్టర్ ప్రధానికి ఎదురుపడ్డారు. ‘సార్ మీరు మా షోకు వస్తారా’ అంటూ బోరిస్‌ను ప్రశ్నించారు. ‘దేవుడా వీళ్లు ఇక్కడ కూడా తయారయ్యారా’ అంటూ తన మనసులో విషయాన్ని సహాయకుడు అనుకోకుండా బయటపెట్టేశారు. ఆ సమయంలో ఇదంతా టీవీలో లైవ్‌లో ప్రసారమవుతోంది. దీంతో అక్కడున్నవారే కాదు టీవీ చూస్తున్న ప్రేక్షకులూ, లైవ్‌లో ఉన్న యాంకర్, టెక్నీషియన్లు షాక్‌కు గురయ్యారు. రిపోర్టర్ ప్రశ్నకు స్పందించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జన్సన్ ‘జస్ట్.. వన్ సెకండ్’.. అంటూ చటుక్కున పాలసీసాలను భద్రపరిచే భారీ ఫ్రిజ్ లోకి వెళ్లి దాక్కున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ వైరల్ అవడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బోరిస్ సభ్యుడిగా ఉన్న కన్వర్వేటివ్ పార్టీ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. రిపోర్టర్ ప్రశ్నపై చర్చించేందుకు బోరిస్ సహాయకులు ఆయనను అలా పక్కకు తీసుకెళ్లారని పార్టీ వర్గాలు చెప్పాయి.