ఛారుమతి చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించిన నాటా నాయకులు

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని తెలుగు వారికి సహకారం అందించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది నాటా. దేశంలోని తెలుగుజాతికి తన వంతుసాయంగా నాటా ప్రతిఏటా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సాంస్కృతిక వికాసమే నాటా మాట! సమాజ సేవయే నాటా బాట! అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మాతృరాష్ట్రాల్లో సేవా డేస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ విడత ‘నాటా సేవా డేస్‌’ పేరుతో ఈ నెల 9 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మాతృరాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా డేస్‌ కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో ఉన్న ఛారుమతి చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే చర్లపల్లిలో ఉన్న స్నేహ అనాథాశ్రమాన్ని సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. నాటా డైరెక్టర్‌ రవి కందిమళ్ళ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు. నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసల, ఆళ్ళ రామిరెడ్డి, నారాయణరెడ్డి గండ్ర, సుధ కొండపు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.