గ్రేటర్‌ అట్లాంటా తెలుగు అసోసియేషన్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా గొర్రెపాటి

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్‌ అట్లాంటా తెలుగు అసోసియేషన్‌(గాటా) 10వ చీఫ్‌ కోఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి నియమితులు అయ్యారు. డిసెంబర్‌ 8న జరిగిన గ్రేటర్‌ అట్లాంటా తెలుగు అసోసియేషన్‌ వ్వవస్థాపక సభ్యులు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సమావేశాన్ని నిర్వహించి ఆయనను గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వ్వవస్థాపక సభ్యులు, నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాటా వ్యవస్థాపకులు తంగిరాల సత్యనారాయణ రెడ్డి, గిరీష్‌ మేక, సత్య కర్నాటి మాట్లాడుతూ.. గాటా గత 10 సంవత్సరాలుగా చేసిన వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఇక చీఫ్ కోఆర్డినేటర్‌ సాయి గొర్రెపాటి మాట్లాడుతూ.. 10వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించారు. అట్లాంటాలో ఇన్ఫినిటీ సెంటర్ లో మే 29 ,30 న జరగబోయే కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తమ సభ్యులు తరలి రావాలని తెలిపారు. గాటా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలు అందరిని అలరిస్తాయని నూతన కార్యవర్గం ప్రకటించింది. గాటా నిర్వహకులు గౌతమ్ గోలి, కిరణ్ పాశం, రవి కందిమళ్ళ, అరుణ్ కాట్పల్లి, తదితరులు సాయి గొర్రెపాటికి శుభకాంక్షలు తెలుపుతూ గాటా కన్వెన్షన్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.