గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

సినీ ప‌రిశ్ర‌మ మంచి వ్య‌క్తిని కోల్పోయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గొల్ల‌పూడి మారుతీ రావు మృతి ప‌ట్ల జ‌గ‌న్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కూడా గొల్ల‌పూడి మృతికి నివాళులు అర్పించారు. మంచి న‌టుడు, ర‌చ‌యిత‌ని కోల్పోయాం అని ఆయ‌న అన్నారు.

  ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారని తలసాని శ్రీనివాస్ యాదవ్  అన్నారు. సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల సినీనటుడు కోట శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు.